న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వచ్చే 12 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఆ తర్వాత 24 గంటల్లో అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపానుకు ఇప్పటికే ‘అంఫాన్’ అని పేరు పెట్టారు. ఇది రేపటి వరకు ఈశాన్య వాయవ్య దిశగా కదిలి, ఆపై మే 18-20 మధ్య వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు తిరుగుతుందని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఆనంద్ దాస్ తెలిపారు.
వచ్చే ఐదారు రోజులు అండమాన్ సముద్రం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశా, గంగా తీరప్రాంత పశ్చిమబెంగాల్లలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
‘అంఫాన్’ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతంలోని 12 జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. దక్షిణ దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, కాబట్టి జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, ఈ ప్రాంతాల మీదుగా సముద్రంలో ఉన్నవారు ఈ రోజు సాయంత్రం నాటికి తీరాలకు తిరిగి చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది.