దేశవ్యాప్తంగా జూన్ 30వరకు బుక్ చేసుకున్న రెగ్యులర్ రైళ్ల టికెట్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులకు చార్జీల సొమ్మును పూర్తిగా వాపసు ఇస్తామని చెప్పింది. అంటే జూన్ 30వరకు సాధారణ ప్రయాణికుల రైలు సర్వీసులు ప్రారంభం కావన్నమాట. అయితే వలస కూలీల కోసం నడుపుతున్న శ్రామిక్ రైళ్లు, 12 నుంచి కొన్ని మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు మెయిల్/ ఎక్స్‌ప్రెస్ సహా రెగ్యులర్ ప్రయాణికుల రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ గురువారం వెల్లడించింది. ఏప్రిల్ 14లోపు బుక్ చేసుకున్న టికెట్లన్నీ రద్దు చేసినట్లు తెలిపింది
May 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జూన్ 30వరకు రైళ్లకు నో...
Rating: 5
Reviewed By: NEWS UPDATE

