అహ్మదాబాద్: భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో అనేక రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా పెళ్లిళ్లపై ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో ప్రభావం చూపించింది. దీంతో దేశంలో అనేక చోట్ల పెళ్లి భాజాలు మోగలేదు. కొన్ని పెళ్లిళ్లు వాయిదా పడగా.. మరికొన్ని వివాహాలు రద్దు చేసుకున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న ఈ రెండు నెలల కాలంలో ఒక్క గుజరాత్‌లోనే దాదాపు 30వేల పెళ్లిళ్లు వాయిదా పడగా, మరికొన్ని కొన్ని రద్దయినట్టు హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ అధికార ప్రతినిధి అభిజిత్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ పెళ్లిళ్ల సీజన్.. ఈ కాలంలోనే రాష్ట్రంలో అత్యధికంగా పెళ్లిళ్లు జరుగుతుంటాయన్నారు. ఈ విపత్కర పరిస్థితులతో పెళ్లి వాయిదా వేసుకోవడం ఇష్టంలేని కొందరు వధూవరులు మాత్రం తమ కుటుంబంలోని ఎనిమిది లేదా పది మంది సమక్షంలో ఒక్కటయ్యారని వెడ్డింగ్ ప్లానర్ దేవాంగ్ షా తెలిపారు.
మే 18 నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్లు, ఆలయాలకు మాత్రం అనుమతివ్వకపోవడంతో వివాహ వేడుకలను నిర్వహించడం మరింత కష్టతరంగా మారిందన్నారు. కొందరు తమ వివాహాల బుకింగ్‌లను రద్దు చేసుకోవడంతో పాటు ఈ వేడుకలను డిసెంబర్, జనవరి మాసాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకొనేందుకు వేచి ఉండటం ఇష్టంలేని కొందరు మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహాలు జరుపుకొన్నారని తెలిపారు.