దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 6387 కేసులు, 170మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,51,767కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 4337 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 64,426మంది కోలుకోగా మరో 83,004మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. నిన్న ఒక్కరోజే దాదాపు 4వేల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కొత్తగా 2091 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 97మంది మృత్యువాతపడటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో కరోనా సోకిన వారిసంఖ్య 54,758కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 1792మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లోనూ రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది.