గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో 43 మందికి రూ.8.4లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే విడదల రజిని ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గానికి చెందిన మరో ఇద్దరికి అత్యవసర వైద్యసదుపాయం కోసం మరో రూ.3.4లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యం ఇస్తూ తమ ప్రభుత్వం ముందుకుపోతోందన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ఆర్థిక చేయూతను ఇస్తున్న తొలి రాష్ట్రం ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. విప్లవాత్మక పరిపాలనను సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఇకపై మిగిలిన రాష్ట్రాలు కూడా పాలనలో ఏపీ బాట పట్టక తప్పదని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పై మిగిలిన రాష్ట్రాలు కూడా ఆరా తీస్తున్నాయని, దేశవ్యాప్తంగా త్వరలోనే ఇలాంటి గ్రామ సచివాలయాలతో కూడిన పరిపాలన వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపారు. సంక్షేమ పథకాలు అందించడంలో తమ ప్రభుత్వం ఎలాంటి పార్టీ వివక్ష చూపడంలేదని చెప్పారు. ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నామన్నారు. తమ పార్టీ గెలుపొందిన ఏడాది కాలంలోనే తిరిగిలేని పాలన అందిస్తూ తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
May 24, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 8.4 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

