గుంటూరు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం లోని శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ లో రైతులు మిర్చి టిక్కీలను పెట్టడం జరిగింది. ఈ తరుణంలో రెండు నెలలుగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఏసి వదలక పోవడం తో కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న 60 వేల టిక్కీలకు 20 వేల టిక్కెట్లు ఆగం అయిపోవడంతో రైతులు శనివారం గుంటూరు మాచర్ల రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ తరుణంలో ట్రాఫిక్ జామ్ కావడంతో రాజుపాలెం మండలం ఎస్సై వెంకటప్రసాద్ రూరల్ సీఐ రత్తయ్య రైతుల దగ్గర చేరుకొని వారికి నచ్చచెప్పి యాజమాన్యంతో మాట్లాడటం జరుగుతుందని వారిని పిలిపించడం జరుగుతుందని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి టిక్కీలకు సంబంధించి ఎక్కువగా రాజుపాలెం మండలం బీరవల్లి పాయ ముప్పల మండలం దమ్మలపాడు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆరు కాలం కష్టపడి 400 నుంచి 500 రూపాయలు చెల్లించి కూలీలకు కోల్డ్ స్టోరేజ్ లో పెడితే మిర్చి ఆగం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారికి నష్టపరిహారం ఇవ్వాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం మాత్రం రైతుల వంక చూడలేదు.
May 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రాజుపాలెం మండలం లో రోడ్డెక్కిన మిర్చి రైతులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

