వాషింగ్టన్: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. ఈ విషయంలో చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా హాంకాంగ్ విషయంలో మాత్రం చైనాపై చర్యలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవి ఈ వారం చివర్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. వైట్‌హౌజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. ఈ వారం చివర్లో ప్రకటించే చర్యలు చాలా శక్తిమంతంగా, ఆసక్తికరంగానూ ఉంటాయని అన్నారు.
చైనా ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమల్లోకి తెస్తామని చైనా ప్రకటించడంతో హాంగ్‌కాంగ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులను అదుపుచేయడానికి అక్కడి పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఈ సందర్భంగా వందల మందిని అరెస్టు చేశారు. హాంకాంగ్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.