728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2020

చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన సీ.పీ.ఐ నాయకులు

గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని ,వ్యాపారస్తులు నిత్యావసర సరుకుల ధరలు పెంచి అమ్ముతూ  పేద ప్రజలను దోచుకుంటున్నారని AIYF ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసులో సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ వినతిపత్రం  అందచేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ మాట్లాడుతూ తూనికలు,కొలతల అధికారులు పలుమార్లు వచ్చి కేసులు నమోదు చేసిన కొంతమంది వ్యాపారస్తుల తిరుమారలేదని అన్నారు.AIYF జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుభాని మాట్లాడుతూ కూలినాలి చేసికొని జీవనం సాగించే పేద ప్రజలు లాక్డౌన్ ఉండడంతో పనులులేక నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో వారి జీవన పరిస్థితి మరింత దిగజారిపోయింది.కాబట్టి పేద ప్రజల జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచి అమ్ముతున్న వారి మీద  కఠిన చర్యలు తీసుకోవాలని,నిత్యావసర సరుకుల ధరలను వెంటనే కట్టడిచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కామ్రేడ్ మల్లికార్జున్, కామ్రేడ్ దుర్గ, కామ్రేడ్ అప్పలనాయుడు,కామ్రేడ్ వెంకటేష్,కామ్రేడ్ ఆన్వార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన సీ.పీ.ఐ నాయకులు Rating: 5 Reviewed By: NEWS UPDATE