వలస కూలీల కోసం రెండు రిలీఫ్ సెంటర్లు: చిలకలూరిపేట అర్బన్ సిఐ
గుంటూరు జిల్లా:చిలకలూరిపేట పట్టణంలో వలస కూలీల కోసం రెండు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అర్బన్ సూర్యనారాయణ తెలియజేశారు.వలస కూలీలు ఎవరైనా నడిచి వెళుతుంటే వారి సమాచారాన్ని రెవెన్యూ, మునిసిపల్, పోలీస్ శాఖలకు తెలియజేస్తే వారిని వారి స్వస్థలాలకు ప్రభుత్వం పంపే ఏర్పాటు చేస్తుందని వారు తెలిపారు.