728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 17, 2020

విశాఖలో డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పరామర్శించారు


విశాఖపట్నం:విశాఖలో డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పరామర్శించారు

★ వారికి ధైర్యం చెప్పి వాదార్చారు.

★ సుధాకర్‌ను పిచ్చాసుపత్రికి తరలించడం దారుణమన్నారు.

★ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ..

★ డాక్టర్ సుధాకర్ తల్లి షాక్‌లో ఉన్నారన్నారు.

★ కొడుకును ఈ స్టేజ్ వరకు చదివించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడతారని, ఆ కష్టం ఇవాళ బూడిదలోపోసిన పన్నీరయిందన్నారు.

★ కేవలం మాస్కులు అడిగిన పాపానికి తన కొడుకును పిచ్చోడిని చేశారని ఆ తల్లి కన్నీటిపర్యంతమైన్నారు.

★ డాక్టర్ సుధాకర్ 26 ఏళ్ల సర్వీసులో ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదని, ఊరికే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

★ కసబ్ లాంటివాళ్లను అరెస్టు చేసి తీసుకెళ్లే విధంగా డాక్టర్ రెండు చేతులు వెనక్కి కట్టి, లాఠీతో కొట్టి తీసుకువెళ్లడం అమానుషమని అనిత అన్నారు.

★ ఇంతకుముందు నరసరావుపేటలో రెడ్డి కులానికి చెందిన డాక్టర్ కూడా ఇలాగే మాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిత విమర్శించారు.

★ సుధాకర్ దళితుడు కాబట్టి కక్షగట్టి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

★ పోలీసులు తీరు బాగోలేదని ఆమె విమర్శించారు.

★ మాస్కులు అడిగినంత మాత్రానా సస్పెండ్ చేస్తారా? ఈ విధంగా ఎంతమందిని ప్రభుత్వం సస్సెండ్ చేస్తుందని అనిత ప్రశ్నించారు.

★ ఇది ప్రభుత్వ వైఫల్యమని, డాక్టర్ సుధాకర్ ఆ విధంగా ఉండడానికి కారణం సీఎం జగన్ అని, ఆయనపై కేసులు పెట్టాలని అనిత డిమాండ్ చేశారు.

★ డాక్టర్‌కు తమ మద్దతు ఉంటుందని అనిత స్పష్టం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విశాఖలో డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పరామర్శించారు Rating: 5 Reviewed By: NEWS UPDATE