728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 28, 2020

పెరుగుతున్న క‌రోనా కేసులు... భ‌యాందోళ‌న‌లో పేట ప్ర‌జ‌లు


  • ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆశించారో అదే జ‌రుగుతోంది. చుట్టూ క‌రోనా కేసులు విజృంభిస్తున్నా, స‌మీపంలో ఉన్న న‌ర‌స‌రావుపేట లో క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతున్నా మ‌న‌కు   ఒక్క కేసుతో నే ఇప్ప‌టివ‌ర‌కు స‌మ‌సిపోయింద‌ని ఆనంద‌ప‌డ్డాం.. లాక్‌డౌన్ స‌డ‌లింపులతో ప్ర‌జా జీవితం గాడిన ప‌డుతుందని, ఇబ్బందులు తొల‌గిపోయి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని ఆశించాం.  ఒక్క‌రోజే ఆరు కేసులు న‌మోదు కావ‌టంతో భ‌విష్య‌త్తులో ఈ కేసులు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 
  • మ‌రింత‌గా పెర‌గ‌నున్న కేసులు... 
  • ఇప్పటివరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం మీద చందవరం ఒక‌టి, పట్టణంలో ఐదు కేసులు, ఎడ్లపాడు 3, మొత్తం నియోజకవర్గంలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు ఏడుగా నిర్ధార‌ణ అయ్యింది. ప‌ట్ట‌ణ ప‌రిధిలో యువ‌వైద్యురాలు క‌రోనా వ‌చ్చి కోలుకోగా, చంద‌వరంకు చెందిన వృద్దుడు మృతి చెందాడు. ప‌రీక్ష‌ల తాలుకు ఫ‌లితాలు ఇంకా అంద‌వ‌ల‌సి ఉంది. చంద‌వ‌రం కు చెందిన వృద్దుడు ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొంద‌గా అదే ఆసుప‌త్రిలో దోభి ప‌ని చేసే మ‌హిళ‌కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఇదే ఆసుప‌త్రిలో వృద్దుడు చికిత్స పొందిన‌ప్పుడు ఉన్న ప‌లు రోగులను గుర్తించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వాటి తాలుకు ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌ల్సి ఉంది. 
  • చంద‌వ‌రం వృద్దుడితో క‌రోనా సోకిన దోభి ప‌నిచేసే మ‌హిళ ప‌ట్ట‌ణంలోని మ‌రో ప్రైవేటు ఆసుప‌త్రిలో ప‌నిచేయ‌టంతో ఆ ఆసుప‌త్రి వ‌ర్గాల్లోనూ, ఈ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన ప‌లువురు రోగుల్లోనూ ఆందోళ‌న నెల‌కొంది. అ మ‌హిళ సంచ‌రించిన ప్రాంతాల్లో , స‌న్నిహిత సంబంధాలు ఉన్న వ్య‌క్తుల‌ను గుర్తిస్తున్నారు. 
  • మ‌రోవైపు చిన‌పీరుసాహెబ్ వీధిలోని మ‌హిళకు క‌రోనా ఎలా సోకింద‌న్న విషయంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఈ విష‌యంపై భిన్న‌వాద‌న‌లు విన‌వ‌స్తున్నాయి. ఈ మ‌హిళ ఇంటికి ఇటీవ‌ల వ‌చ్చిన గుంటూరు బంధువుల వ‌ల్ల క‌రోనా సోకిన‌ట్లు కొంత‌మంది చెబుతుండ‌గా, గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందే స‌మ‌యంలోనే వ్యాధి సోకిన‌ట్లు మ‌రికొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ మ‌హిళ వ‌ల్ల ఇప్ప‌టికే అదే వీధిలో ఉన్న మ‌రో ఇరువురికి పాజిటివ్ ఫ‌లితాలు రాగా, య‌డ్ల‌పాడులో ఉన్న ఆమె తాలుకు బంధువుల‌కు సైతం క‌రోనా వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు.
క‌రోనా ప‌రీక్షల ఫ‌లితాలు వ‌స్తే మ‌రిన్ని కేసులు బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది. కేసుల తీవ్ర‌త పెరుగుతున్న కొద్ది ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. స్వీయ నియంత్ర‌ణ‌తోనే దీన్ని ఎదుర్కోవ‌ల్సింద‌న్న ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటించాల్సిందే. 



Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పెరుగుతున్న క‌రోనా కేసులు... భ‌యాందోళ‌న‌లో పేట ప్ర‌జ‌లు Rating: 5 Reviewed By: NEWS UPDATE