728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 15, 2020

రాష్ర్ట వ్యవసాయశాఖమంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్ కామెంట్స్

‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించి 49,43,590 మంది రైతుల ఖాతాల్లో ఈ రోజు పెట్టుబడి సాయం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేతులమీదుగా వేశాం.

మొదటి ఏడాది 46,69,000 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాం.

రైతు భరోసాలో పేర్ల నమోదుకు మరో నెలరోజులపాటు అవకాశం.జూన్ 15 వతేదీవరకు అర్హత ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కౌలు రైతులు ఈ పధకంలో లబ్దిపొందకుండా ఇబ్బంది పడకూడదనే ఉధ్దేశ్యంతో మళ్లీ అర్హత ఉన్న కౌలురైతులను తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద ఎండోమెంట్స్ భూములను సాగుచేసుకునేవారికి కూడా రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాం.

ఏప్రిల్ లో రెండు వేల రూపాయలు ఈ పధకం కింద రైతులకు ఇచ్చాం.ఇప్పుడు 5,500 రూపాయలు ఇస్తున్నాం.కౌలు రైతులయితే పిఎం కిసాన్ లో కవర్ అవ్వరు కనుక ఈ విడత వచ్చే కౌలు రైతులందరికి కూడా 7,500 రూపాయలు అకౌంట్ లోపడుతుంది.

కౌలురైతులకు పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను.రైతు,రైతు సంక్షేమం అంటేనే గుర్తుకువచ్చే ప్రభుత్వం ఇది.గుర్తుకువచ్చే నాయకుడు జగన్.అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నారో మీ అందరికి తెలుసు.

అందుకే కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులున్నా కూడా రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2,800 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది.ఇది ఒక చరిత్రగా చెబుతున్నాం.ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసం చేయరు.

రైతుపట్ల ఆయనకున్న బాధ్యతకు,ప్రేమకు ఇదే నిదర్శనం.దీంతోపాటు మార్కెటింగ్ కు సంబంధించి సిఎంగారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ఏ పంట అయినా సరే గిట్టుబాటుధర లభించకపోతే ఇంటర్ వీన్ కావాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు.

 గతంలో ఎప్పుడు లేనివిధంగా 1,052 కొనుగోలు కేంద్రాలు అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కాకుండా మొక్కజొన్న,అపరాలు వంటివాటికోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది.

లాక్ డౌన్ ప్రారంభం అయిననాటినుంచి వేయి కోట్ల రూపాయల వ్యవసాయఉత్పత్తులను మార్కెటింగ్ శాఖద్వారా ప్రొక్యూర్ మెంట్ చేశాం.

ఈ సంవత్సరం ఇప్పటిదాకా 1500 కోట్ల రూపాయల వ్యవసాయఉత్పత్తులను కొనుగోలు చేశాం.మొక్కజొన్న మొదలుకుని పసుపువరకు,టమాటాలు మొదలుకుని పెండలం,గుమ్మడికాయలవరకు కొన్నాం.

ఏ రైతు అయినా అతని వద్ద పలానా పంట ఉండిపోయిందంటే తక్షణం స్పందించి ప్రభుత్వం కొంత భారాన్ని భరించడానికైనా సిధ్దమై కొని తీసుకువచ్చి విక్రయిస్తోంది.

రెండు లక్షల టన్నులపైగా 355 కోట్లరూపాయల విలువైన మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది.135 కోట్ల విలువైన 53 వేల టన్నులు జొన్నలు కొనుగోలు చేయడం జరిగింది.678 కోట్ల విలువైన 1,38,000 టన్నుల బెంగాల్ గ్రామ్ కు వెచ్చించాం.292 కోట్ల విలువైన 50 వేల టన్నుల కందులు,29 కోట్ల రూపాయల విలువైన 4,500 టన్నుల పసుపుకొనుగోలు చేయడం జరిగింది.

ఇదే విధంగా 773 టన్నుల ఉల్లి,12 వేల టన్నుల బనానా లతో పాటు టమాటా వరకు అన్ని ఉత్పత్తులు కొంటూ ఉన్నాం.

ముఖ్యమంత్రి ఈరోజు కూడా రైతుభరోసా కార్యక్రమం ఉన్న వ్యవసాయంపై సమీక్ష చేశారు.బత్తాయి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.

అనంతపురం,వైయస్సార్ కడప జిల్లాలనుంచి పెద్ద ఎత్తున బత్తాయి వస్తోంది ధర ఎట్టిపరిస్ధితులలో పడిపోడానికి వీల్లేదు.కొనుగోలు చేసి మార్కెట్ లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు.

నిన్న 180 టన్నుల బత్తాయి కొంటే, ఈరోజు 200 టన్నులు కొన్నాం.రేపటినుంచి రోజుకు 500 టన్నుల బత్తాయి మార్కెటింగ్ శాఖద్వారా కొనేందుకు ఏర్పాట్లు చేశాం.

వైయస్సార్ రైతు భరోసా పధకాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామో,అదే విధంగా రైతుభరోసా కేంద్రాలను ఈ నెల 30 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రారంభించబోతున్నారు.

ఇది ఒక గేమ్ ఛేంజర్ కాబోతోంది.రాష్ర్టంలో వ్యవసాయం,వ్యవసాయరంగం స్వరూపాన్నే మార్చే ఒక గొప్ప విధానం కాబోతోంది.

10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకాబోతున్నాయి.ఈ రైతుభరోసా కేంద్రాలలో నాణ్యమైన ఎరువులు,పురుగుమందులు,విత్తనాలు విక్రయించడమే కాకుండా దాంతోపాటు రైతుకు విజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా,మార్కెట్ ఇంటర్ వెన్సన్ సెంటర్లుగా,కొనుగోలు కేంద్రాలుగా పనిచేస్తాయి.సమగ్ర వ్యవసాయకేంద్రాలుగా అవతరించబోతున్నాయి.

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసి,ప్రభుత్వం ఏర్పడి మే 30 వతేదీనాటికి సంవత్సరం అవుతోంది.ఈ పధకాన్నిఆరోజు ప్రారంభిస్తున్నారంటే  దానిని బట్టి దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందనేది అర్ధమవుతుంది.

రైతులు,రైతు సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందనేది మీరు అర్ధం చేసుకోవాలి.

ఆ గ్రామంలో వాతావరణానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని రైతులకు అందించే విధంగా.... అంటే పంటలు ఏ రోజు వేసుకోవాలి...ఏరోజు కోసుకోవాలి అని చెప్పేవిధంగా సూక్ష్మస్దాయికి వెళ్లి ఈ కేంద్రాలు పనిచేస్తాయి.

ఉచిత పంటల భీమా పధకం ప్రీమియం ను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది.గత ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలను ఈ ప్రభుత్వం అందిస్తోంది.మూడువేల కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్ వెన్సన్ నిధిని మనం ప్రారంభించాం.

శనగ రైతులు నష్టపోతున్నారంటే ఇచ్చిన మాట ప్రకారం  క్వింటాలుకు 1500 రూపాయల చొప్పున 330 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్ వెన్సన్ కింద రైతులకు సహాయం చేశాం.

త్వరలోనే అగ్రికల్చర్ అడ్వయిజరీ బోర్డ్స్ ను జిల్లా,మండలస్దాయిలలో ఏర్పాటుచేయబోతున్నాం.ఈ బోర్డులు వచ్చినట్లయితే ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేసుకోవాలి.ఏ పంటకు గిరాకి ఉంది.ఏ పంటల విస్తీర్ణం తగ్గించాలి.ఇతరత్రా సలహాలు,సూచనలు ఈ బోర్డులు అందచేస్తాయి.

రైతు భాగస్వామ్యంతో రాష్ర్టంలో వ్యవసాయప్రణాళికలు రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాలు,సాగునీటినీటికి సంబంధించి కూడా ఈ బోర్డులలో చర్చించేవిధంగా వీటిని క్రియేట్ చేయబోతున్నాం.

పగటిపూట 9 గంటల పాటు ఉచితవిద్యుత్ ఇస్తానని సిఎం ప్రకటించిన విధంగా దాదాపు 82 శాతం ఫీడర్లు సిధ్దమయ్యాయి.అధికారంలోకి వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు దీనికి కేటాయించారు.మరో 18 శాతం ఫీడర్లు త్వరలోనే సిధ్దం కాబోతున్నాయి.ఇచ్చిన మాటను ఏడాది తిరిగేలోపే నిలబెట్టుకున్నారని తెలియచేస్తున్నాను.

వాస్తవాలు ఇవైతే చంద్రబాబు జూమ్ సభలు పెడుతున్నారు. 
జూమ్ లో వారి పార్టీ నేతలతో రకరకాలుగా మాట్లాడుతున్నారు.పార్టీల పరంగా మీరు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు.

కట్టుకధల్ని ప్రచారం చేసే కార్యక్రమాలు చేయవద్దని చెబుతున్నాం.వ్యవసాయం కోసం అహర్నిశలు పనిచేస్తూ ఎన్ని వేలకోట్ల రూపాయలు పెట్టడానికైనా సిధ్దంగా ఉన్నాం.ప్రయాసకైనా భరిస్తాం.కొత్త వ్యవస్ధను రూపొందిస్తాం అని సిఎంగారు ముందుకు వెళ్తుంటే రైతులను గాలికి వదిలివేసినట్లుగా మీరు ప్రచారం చేయడం అనేది మీ చిన్నబుధ్దిని తెలియచేస్తోంది.

చంద్రబాబూ....ఎందుకింత దిగజారిపోతున్నారు.ప్రతి అంశంలో కూడా మీరు రాజకీయాన్నే చూస్తున్నారు.

గతంలో మీరు ఎప్పుడనా కేజి టమాటాను కొనుగోలు చేయించారా...మార్కెట్ ఇంటర్ వెన్సన్ ను,మార్కెట్ ఇంటిలిజెన్స్ ను క్లారిటీతో ఒక విధానం రూపొందించగలిగారా.... ఇవేం చేయలేదు.

ఏమీ చేయకుండా ఇచ్చిన రుణమాఫి హామీని కూడా అమలు చేయకుండా వారికి బాండ్లని,పత్రాలని ఇచ్చేసి మీకు మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుని ఎన్నికల ముందు మళ్లీ అన్నదాతా సుఖీభవ అని బోగస్ కార్యక్రమాన్ని క్రియేట్ చేశారు.

మీ మోసపు వైఖరి తెలుసుకుని రైతులు మీకు ఖచ్చితమైన గుణపాఠం చెప్పారు.

మీలాంటి నాయకుల మాటలు నమ్మి పదే పదే మేం మోసపోమని ఎన్నికల్లో తీర్పు కూడా ఇచ్చారు.అయినప్పటికీ ఎక్కడా కూడా అవమానం కూడా ఫీలవకుండా.... తప్పుచేశామని పశ్చాత్తాపం లేకుండా....గత ఐదేళ్లలో ఏమీ చేమీచేయలేకపోయామనే క్షమాపణ కూడా చెప్పకుండా ఇప్పుడేదో అన్యాయం జరిగిపోతోందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఆరోజు రుణమాఫిని ఎందుకు అమలు చేయలేకపోయారో ముందు రైతులకు క్షమాపణ చెప్పండి.

ఈరోజు ముఖ్యమంత్రిని చూడండి.మేనిఫెస్టోను అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుసటిరోజునుంచి ఏ విధంగా తపన పడుతున్నారో చూడండి.

కరోనాలాంటి సంక్షోభంసమయంలో కూడా రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎలా అందించారో జగన్ని చూసైనా అర్ధం చేసుకోమని చెబుతున్నాను.

వైయస్సార్ రైతుభరోసా-పిఎం కిసాన్  పధకంలో ఎవరికైనా ఏవైనా సమస్యలు వస్తే వాటిని అడ్రస్ చేయడానికి,అర్హత ఉన్నవారు మిస్ అయితే వాటిని తక్షణం పరిష్కరించడానికి 1902 కు మీరు కాల్ చేయవచ్చు.దీనికోసం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాల్ సెంటర్ పనిచేస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ర్ట వ్యవసాయశాఖమంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్ కామెంట్స్ Rating: 5 Reviewed By: NEWS UPDATE