జగన్ పాలన మొత్తం అవినీతిమయం, భూకబ్జాలేనని ఆరోపించారు. ఆరోగ్యసేతు యాప్ తయారు చేసిన విశాఖకు చెందిన వ్యక్తిపై భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటూ పులివెందుల నుంచి వచ్చిన కొందరు దౌర్జన్యం చేశారని అన్నారు. ఆవ, రాజమండ్రి భూములు కబ్జా చేస్తున్నారని... గుడివాాడలో 63 మంది భూములను ఇచ్చేయాలంటూ ఒక మంత్రి బలవంతం చేస్తున్నారని మండిపడ్డారు.
చివరకు ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా టీటీడీ భూములు అమ్మేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సింహాచలంలో భూములు కబ్జా చేశారని, విజయవాడ కనకదుర్గ గుడిలో అవినీతి జరిగిందని, బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నారని విమర్శించారు. కరోనాపై కూడా జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు.

