1️⃣చిలకలూరిపేట పట్టణంలో బుధవారం ఒక్క రోజే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, పట్టణంలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2️⃣చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద బుధవారం రోజు వరకు తొమ్మిది కేసులు నమోదు కావడంతో పట్టణంలో నమోదైన పాజిటివ్ నమోదు అయిన ప్రాంతాల్లో పోలీస్ అధికారులు కంటెంట్మెంట్ జోన్ లను ఏర్పాటు చేశారు.
3️⃣గురువారం ఉదయం కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని ఎమ్మెల్యే విడదల రజిని సందర్శించనున్నారు.
4️⃣గురువారం ఉదయం సుమారు 10 గంటలకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన ప్రాంతాల్ని సందర్శించి జిల్లా అధికారులకు నివేదిక పంపనున్నారు.
5️⃣ఆర్య వైశ్య కళ్యాణ మండపం పక్కనే ఉన్న రజక కాలనీలో మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె ప్రభుత్వాసుపత్రి తోపాటు ఒక ప్రైవేటు వైద్యశాలలో ధోభీ పని చేస్తుండటంతో ఈమె ఇంటి వద్ద ఉన్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ లతోపాటు ఆమె పని చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రిలో ని వైద్యలు మరియు సిబ్బందిని ప్రభుత్వ వైద్యులు కరోనా పరీక్షలు జరుపనున్నారు.
6️⃣చిలకలూరిపేట నియోజకవర్గంలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, గురువారం సాయంత్రం చిలకలూరిపేట రానున్నట్లు తెలిసింది.
7️⃣అయిదు కోవిద్ కేసులు నమోదు అయిన ప్రాంతాన్ని రెడ్ జోన్ కింద జిల్లా అధికారులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


