గుంటూరు జిల్లా: కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పనులు కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఎమర్జెన్సీ అనే విధంగా మద్యం షాపులు తెరిచి 75% మద్యం రేట్లు పెంచి మధ్యతరగతి కుటుంబాల వారికి నడ్డి విరుస్తున్నారు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు వారి సొంత బ్రాండ్లు తయారు చేస్తూ గవర్నమెంట్ వైన్స్ లో అమ్మేస్తున్నారు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను కాపలా పెట్టి మరి మద్యం అమ్మేస్తున్నారు మధ్యతరగతి వారు కుటుంబాలు రోడ్డున పడటానికి ఒక సూత్రము గా భావించిన జగన్ ప్రభుత్వాన్ని అని అనాలి లేక ఏమనాలి కరెంటు బిల్లు నెలకి 400 లేక 500 వచ్చే కరెంటు బిల్లు కరోనా వల్ల లాక్ డౌన్ వల్ల రెండు నెలలు ఇంటి దగ్గరే ఉండాలని ప్రభుత్వం వారు చెబితే రెండు నెలలు కలిపి కరెంటు బిల్లు 20,000 30,000 పాతిక వేలు ఇలా కరెంట్ బిల్లు వస్తే మధ్యతరగతి కుటుంబాలకు కరెంట్ షాక్ తగిలే విధంగా చేశారు .మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ఓటుబ్యాంకు తో అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలను ప్రజలను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి కాకినాడ ఎల్జి ఫార్మ్ లో గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన వారికి కోటి రూపాయలు ప్రమాదంలో గాయపడిన వారికి పాతిక లక్షలు అలాగే ఇచ్చారు ప్రకాశం జిల్లా నాగులపాడు దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి యాక్సిడెంట్ జరిగి చనిపోయిన దళిత కుటుంబాలకు మొదట 5 లక్షలు అన్నారు తర్వాత పది లక్షలు ఇస్తామన్నారు.అంటే ఇక్కడ దళితులు చనిపోయారు ప్రశ్నించ లేరనే తక్షణమే కరెంటు ఛార్జీలు తగ్గించాలి మద్యపానం నిషేధించాలి మద్యం షాపులు మూసివేయించాలి అని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు లాజర్ ,మాజీ ap sc కార్పొరేషన్ డైరెక్టర్ ఇనగంటి జగదీష్ , మాజీ జిల్లా DL DA కొండ వీరయ్య మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గేరారాజ శేఖర్ , జరుగుమల్లి చెన్నయ్య , గట్టుపల్లి మాణిక్య రావు ,దార్ల రాజేష్ ,పిల్లి కోటి , సుబ్బారావు పాల్గొన్నారు.
May 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మధ్యతరగతి కుటుంబాల పై జగన్ ప్రభుత్వం పంజా.తెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ నాయకుల ఆరోపణలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

