ఆంధ్ర ప్రదేశ్: దేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ద్రవిడ ఉద్యమం లాగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం కోసం 35 వేల ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు ఇచ్చి, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల కుట్రకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కూడా నిలిచిపోతుందని తెలిపారు. దేశంలో ముందెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, అభివృద్ధి చెందిన రాజధానిలో తమ భవిష్యత్తు ను నమ్మి 35 వేల ఎకరాలను గత ఐదు సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. సుమారు పది వేల కోట్ల రూపాయలను ఇప్పటికే రాజధాని మీద వేచ్చించడం జరిగింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్జీవో, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, న్యాయ శాఖ భవనాలు, VIT,SRM యూనివర్సిటీలు,AIMS,DGP కార్యాలయం, రాజ్ భవన్,APIIC,R&B, దేవాదాయ శాఖ, అన్ని H.O.D లు, సీడ్ యాక్సెస్ రోడ్లు, అండర్ గ్రౌండ్ కేబుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లతో, శరవేగంగా అభివృద్ధి చెందుతూ 150 పారిశ్రామిక ఒప్పందాలతో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తున్న అమరావతిని దెబ్బతీసేందుకు మూడు రాజధానుల పేరుతో రైతులను అన్యాయం చేయాలని వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ భూములు ఇచ్చిన రైతులు గత 150 రోజుల నుండి చేస్తున్న పోరాటం చారిత్రాత్మకం అని పుల్లారావు పేర్కొన్నారు. పదివేల కోట్ల రూపాయలు ఇప్పటికే రాజధానికి ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాజధానిని మార్చితే అంత మొత్తం ప్రజాధనం వృధా అవుతుంది అన్న సంగతి ఈ ప్రభుత్వం గ్రహించకపోవడం దౌర్భాగ్యం అని పేర్కొన్నారు . భూములను ఇచ్చిన రైతుల త్యాగం వృధాగా పోదు అని, అంతిమ విజయం రైతులదే అని తెలిపారు. రానున్న రోజుల్లో కోర్టులో తీర్పు కూడా రైతుల పక్షాన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని తెలియజేశారు.
May 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అమరావతి రాజధాని రైతుల నిరసన దీక్షలు చారిత్రాత్మకం:మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

