చిలకలూరిపేటలో ఘనంగా చల్లా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో శ్రీ ద్వారకామయి సద్గురు సాయి ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ కుమార్ జన్మదిన వేడుకలు మరియు షష్టిపూర్తి మహోత్సవాన్ని సాయిబాబా ఆలయంలో నిర్వహించారు. పట్టణ ప్రముఖులు ఆయనచే కేక్ కట్ చేయించి ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆలయంలో పనిచేసే సిబ్బందికి తదితరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.