గుంటూరు జిల్లా: నరసరావుపేట పట్టణంలో కరోనా వైరస్ అంటువ్యాధుల నివారణ కోసం గ్రామంలో పాతూరు శివాలయం వద్ద గల బొడ్రాయి కి గ్రామ దేవతలైన పోలేరమ్మ లకు గంగమ్మ తల్లికి, పోతురాజు కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త సాంబశివరావు మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు కొత్తమాసు మల్ల రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా గ్రామ హద్దుల వద్దగల దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆర్.డి.ఓ మొగిలి వెంకటేశ్వర్లు డీఎస్పీ వీరారెడ్డి చాంబర్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
May 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: గ్రామదేవతలకు బొడ్రాయి కి ప్రత్యేక పూజలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

