728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 24, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో కరోనా పాజిటివ్ కేసు ⁉️

గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా రెండో  పొజిటివ్ కేసు నమోదు అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది.

♦️నాదెండ్ల మండలం చందవరం గ్రామంలోని వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుండి విజయవాడ లోని  ఒక కోల్డ్ స్టోరేజ్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.అతను  అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ వృద్ధుని చందవరం లో ఉంటున్న అతని భార్య, కూతురు అతనిని తీసుకొని వచ్చి 18వ తేదీన  చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు.

♦️అయితే ఆ వృద్ధుని పరిస్థితి విషమించడంతో అతనిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆ వృద్దుడు 20 తేదీ మృతి చెందాడు.

♦️మృతి చెందిన వ్యక్తి నుండి బ్లడ్ శాంపిల్ ను తీసి పరీక్షలకు పంపారు.ఆ వృద్ధుని  మృతదేహాన్ని 21వ తేదీన చందవరం గ్రామంలో అతని కుటుంబ సభ్యులు ఖననం చేశారు.

♦️అయితే కోవిద్-19 పరీక్షల్లో వృద్ధుడికి కరోనా  పాజిటివ్ సోకినట్లు శనివారం రాత్రి రిపోర్ట్ వచ్చినట్లు తెలిసింది.మృతి చెందిన వృద్ధుడుని ఎవరెవరు కలిశారు...తదితర వివరాలను సేకరిస్తూ అధికారులు నిమగ్నమయ్యారు.

♦️అయితే చిలకలూరిపేటలో నియోజకవర్గంలో చందవరం లో కరోనా పాజిటివ్ వ్యక్తి ని ఖననం చేయటం తో అతని కూతురు, భార్య ఉండటంతో వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.

♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదయినట్లు తెలుస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో కరోనా పాజిటివ్ కేసు ⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE