ఆంధ్ర ప్రదేశ్:
★ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
★ పాస్‌పోర్ట్ స్వాధీనపరచాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది.
★ తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది.
★ లాక్‌డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి పర్మిషన్ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.
★ ఎల్జీ పాలిమర్స్ పరిసరాలను సీజ్ చేయాలని.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని తెలిపింది.
★ గ్యాస్ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది.
★ ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలని తెలిపింది.
★ ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్‌ను తరలించేందుకు.. ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది.
★ విద్యాసంస్థల, హాస్పిటల్స్, జనావాసాలు ఉన్నచోట... అంత ప్రమాదకరమైన గ్యాస్‌ను ఎలా స్టోర్ చేశారని ప్రశ్నించింది.
★ గ్యాస్ లీకేజీ ఘటనను మే 7న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం, స్టైరిన్ గ్యాస్ తరలించేందుకు అనుమతించడంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
★ శుక్రవారం నాటి విచారణ తర్వాత హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు విడుదల చేసింది.
★ హైకోర్టు తాజా ఆదేశాలతో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన విషయంలో... ఇప్పటి వరకు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు సరైనవేనని రుజువైందని న్యాయనిపుణులు అంటున్నారు.