728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 19, 2020

వ్యవసాయ శాఖ అధికారులతో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని సమావేశం

చిలకలూరిపేట: వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మైన ఎమ్మెల్యే రజిని,
రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చ‌.

🔹ప్ర‌తి రైతుకూ మేలు జ‌రిగేలా చేయ‌డం మ‌న ఉమ్మ‌డి ల‌క్ష్యం కావాల‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌కు పిలుపునిచ్చారు. స్థానిక త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే అన్ని మండ‌లాల వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, వ్య‌వ‌సాయ‌శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ త‌దిత‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం రైతు ప్ర‌భుత్వం అని తెలిపారు. రైతు భ‌రోసా కేంద్రాలను తాత్కాలికంగా అన్ని స‌చివాల‌యాల్లో ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయ‌న్నారు.

🔹ఈ ఏడాది మొత్తం 21 శాశ్వ‌త రైతు భ‌రోసా కేంద్రాల‌ను నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు. ఖ‌రీఫ్‌కు అన్న‌దాత‌ల‌ను సిద్ధం చేయాల‌న్నారు. న‌కిలీ విత్త‌నాల ఉనికే నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌కూడ‌ద‌న్నారు. ఆర్బీకేల్లోనే రైతులు విత్త‌నాలు కొనుగోలుచేసేలా చూడాలని తెలిపారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. మ‌ట్టి న‌మూనా ప‌రీక్ష‌లు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయ‌నే విష‌యాల‌పై ఆరా తీశారు.

🔹నియోజ‌క‌వ‌ర్గంలో 16,593 హెక్టార్ల‌లో ప‌త్తి, 757 హెక్టార్ల‌లో వ‌రి, 3039 హెక్టార్ల‌లో మిర్చి, 4900 హెక్టార్ల‌లో శ‌న‌గ పంట‌లు ఈ ఏడాది సాగ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స‌కాలంలో వ‌ర్షాలు కుర‌స్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంద‌ని, ఈ ఏడాది సంమృద్ధిగా వర్షాలు కుర‌స్తాయ‌ని కూడా వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నార‌ని, అన్న‌దాత‌ల‌కు అన్ని వేళ‌లా అందుబాటులో ఉండేలా అధికారులు చొర‌వ‌చూపాల‌ని ఎమ్మెల్యే కోరారు.

🔹వ‌చ్చే జూలై నెల‌లో కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా ఇవ్వ‌బోతున్నామ‌ని చెప్పారు. కౌలు రైతుల వివ‌రాలు జాగ్ర‌త్త‌గా సేక‌రించాల‌ని అధికారుల‌కు చెప్పారు. అర్హులైన‌ రైతుల‌కు స‌బ్సిడీపై వ్య‌వ‌సాయ ప‌నిముట్లు స‌బ్సిడీపై వ‌చ్చేలా చూడాల‌ని సూచించారు. ఈ ఏడాది త‌గినంత బ‌డ్జెట్ కూడా కేటాయించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. అగ్రి అసిస్టెంట్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హించి రైతుల‌కు పూర్తిస్థాయిలో నాణ్య‌మైన సేవ‌లు అందేలా చూడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ఏడీఏ మ‌స్తాన‌మ్మ, నాదెండ్ల‌, య‌డ్ల‌పాడు, చిల‌క‌లూరిపేట‌రూర‌ల్ మండ‌లాల వ్య‌వసాయ అధికారులు ఎ.హ‌రిప్ర‌సాద్‌, సీహెచ్ స‌రిత‌, పి.శ్రీల‌త త‌దిత‌రులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వ్యవసాయ శాఖ అధికారులతో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని సమావేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE