చిలకలూరిపేట: కరోనా నియంత్రణలో చిలకలూరిపేట నియోజకవర్గం విజయవంతంగా ముందుకు వెళుతోందని, మన సంకల్పమే మనకు రక్షణగా ఉంటోందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. స్థానిక ఆరో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిశెట్టి శ్రీనివాసరావు (గోల్డు) ఆధ్వర్యంలో ఇంటింటికి దాదాపు వెయ్యికిపైగా కుటుంబాలకు శనివారం రెండో విడత నిత్యావసరాలు, కూరగాయలు, కోడిగుడ్లు మెప్మా సిబ్బంది మరియు వాలంటీర్ లు ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతల మంచి మనసు, ప్రజలు పాటిస్తున్న స్వీయ నియంత్రణ చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా అడ్డుకట్టకు విజయసూత్రాలని తెలిపారు. అయితే ఇంతే జాగ్రత్తతో మరికొన్ని రోజులు మనం ఉండాలని లేదంటే కరోనా దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు. కోవిడ్ మహమ్మారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. పరిస్థితులు కుదటపడేవరకు ఎంత సాయం చేసేందుకైనా తాము వెనుకాడబోమని తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకుసాగాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట ఆరోవార్డులో ఇంటింటికీ రెండో విడత నిత్యావసరాలు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

