చిలకలూరిపేట: కోవిడ్ నియంత్రణలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. తన స్వగ్రామం పురుషోత్తమ పట్టణంలోని ఇంటింటికీ నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. మరో 350 గ్రామాలకు అందజేయాల్సి ఉండగా.. శనివారం ఆమె ఆ ఇళ్లకు కూడా కూరగాయలు, నిత్యావసరాలు, బియ్యం మెప్మా సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. కరోనా నియంత్రణ, ఎగ్జిట్ ప్లాన్‌కు సంబంధించి తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటించదలిచిన సూత్రాలనే కేంద్రం కూడా అమలు చేస్తోందని చెప్పారు. కోవిడ్ లాంటి మహా విపత్తు సమయంలో ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా తమ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందజేస్తున్నామన్నారు. కోవిడ్ నుంచి కోలుకుని వచ్చిన రోగులను కదిలిస్తే.. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదో చెబుతారని వెల్లడించారు.
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో తన వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

