728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 6, 2020

వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు "వై" కేటగిరి భద్రత

న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది. ఈ సందర్భంగా రాఘురామ కృష్ణంరాజు  మాట్లాడుతూ తనకు వై కేటగిరి భద్రత కల్పించినట్లు బుధవారం రాత్రి తెలిసిందని, అయితే అధికారికంగా గురువారం లెటర్ రావచ్చునని చెప్పారు. సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారన్నారు.

ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ అమలులో ఉందని, ఈ సమయంలో రావడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కర్ఫ్యూ సడలింపు తర్వాత వస్తానన్నారు. తానిచ్చిన ఫిర్యాదుపై వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం తనకు వై కేటగిరి భద్రత కల్పిస్తోందని రఘురామ స్పష్టం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు "వై" కేటగిరి భద్రత Rating: 5 Reviewed By: NEWS UPDATE