చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో 12 కరోనా పాజిటివ్ కేసులు, చిలకలూరిపేట రూరల్ మండలంలో 17 కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు నమోదయ్యాయి.
నాదెండ్ల మండలం:
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఈరోజు 11 మందికి కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయ్యి. గణపవరంలో ఒక కేసు నమోదయ్యింది. సాతులూరు గ్రామంలో నిన్నటి వరకు 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేడు నమోదైన 11 కరోనా పాజిటివ్ కేసులతో నియోజకవర్గంలోనే ఎక్కువ కేసులు 60 నమోదు అయిన గ్రామంగా సాతులూరు రికార్డు సృష్టించింది. అయితే నియోజకవర్గ పరిధి మొత్తంమీద అదే గ్రామంలో ఐదుగురు కరోనాతో మృత్యు బారినపడి మృతి చెందారు. మొత్తం మీద సాతులూరులో కరోనా రికార్డుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది.
చిలకలూరిపేట మండలం:
చిలకలూరిపేట మండల పరిధిలోని ఎడవల్లి గ్రామంలో ఒక కరోనా పాజిటివ్ కేసు, కోమటినేనివారిపాలెంలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో నిన్నటి వరకు 13 కేసులు నమోదు కాగా ఈ రోజు నమోదైన 16 కేసులతో ఆ గ్రామంలో మొత్తం 29 కేసులు నమోదయ్యాయి. గత నెల 25వ తేదీన కరోనా పాజిటివ్ ఒక వ్యక్తి మృతి చెందాడు.