728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 28, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ రోజు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు...దీనితో 12కి చేరిన కేసుల సంఖ్య

గుంటూరు జిల్లా:
🔴చిలకలూరిపేట నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

🔴బుధవారం వరకు నియోజకవర్గం మొత్తం మీద 9 కేసులు నమోదయ్యాయి. గురువారం తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో మరో మూడు పాజిటివ్ కేసులు పెరిగాయి.

🔴నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో కరోనా పాజిటివ్ తో 21 వ తేదీన  మృతి చెందిన చందవరంలోని వృద్ధుని భార్యకు ,గొరిజవోలు లో నివాసం ఉంటున్న అతని కుమార్తె కు కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా అధికారులు నిర్ణయించి ,ఆయా ప్రాంతాల్లో కంటెంట్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.

🔴అలానే ఎడ్లపాడు మండలం లోని తిమ్మాపురం గ్రామం లోని ఎస్సీ కాలనీలో మహిళకు కరోనా  పాజిటివ్ సోకినట్లు ఆ ప్రాంతంలో అధికారులు కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు.

🔴 మొత్తం మీద  మొదటి నుండి ఈరోజు వరకు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పన్నెండు కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు వరకు నమోదయ్యాయి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ రోజు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు...దీనితో 12కి చేరిన కేసుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE