728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 25, 2020

ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము : మంత్రి మోపిదేవి

గుంటూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన పరిపాలనకు స్వీకారం చుట్టారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని మోపిదేవి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో 46 వేల కోట్లు ఖర్చు చేసి 3 లక్షల మంది లబ్దిదారులకు వివిధ పథకాలు అందించామని ఆయన అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము : మంత్రి మోపిదేవి Rating: 5 Reviewed By: NEWS UPDATE