ఆంధ్ర ప్రదేశ్: వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన వ్యవహారంపై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో ఆమెపై సీఐడీ విచారణ చేపట్టారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.రంగనాయకమ్మ పెట్టిన పోస్టునే నేను కూడా పెడుతున్నాను, నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. సోషల్ మీడియా అనగానే వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలవుతుందని, అసమర్ధ పాలన సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోందని విమర్శించారు.
May 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రంగనాయకమ్మ పెట్టిన పోస్టునే నేనూ పెడుతున్నా...నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి: నారా లోకేశ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

