గుంటూరు జిల్లా:
♦️మార్చి 23 వ తేదీన దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటినుండి సుమారు ఇరవై రోజుల వరకు చిలకలూరిపేటలో ఎటువంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. మొదటి కేసు పట్టణంలోని శివాలయం వెనుక వీధిలో నమోదైంది. రెండవ పాజిటివ్ కేసు ఇటీవల చందవరం గ్రామం సంబంధించిన ఒక వృద్ధునికి సోకి మృతి చెందాడు. మూడవ పాజిటివ్ కేసు పట్టణంలోని చినపీరుసాహెబ్ వీధి లో ఒక మహిళకు పాజిటివ్ నమోదయింది .
♦️ఇప్పటివరకు పట్టణంలోని శివాలయం వీధి 500 మీటర్ల పరిధిలో అధికారులు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఆ జోన్ జూన్ 3 వ తేదీ తొలగిస్తారు అనుకుంటుండగా కళామందిర్ థియేటర్ కు ఇటుపక్క వీధిలో కేసు నమోదు కావడంతో అటు ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ కాస్తా ఇటు ఏర్పాటు చేశారు.
♦️అయితే మొత్తంమీద చందవరం, చిన్నపీరు సాహెబ్ వీధి తాలూకు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ చేసిన వారిని 121 మందిని సోమవారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బుధవారం చందవరం గ్రామానికి సంబంధించిన కొంతమందిని ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.
♦️అయితే చినపీరుసాహెబ్ వీధికి చెందిన మహిళ బంధువులు ఎడ్లపాడు లో కూడా ఉండటంతో వారికి కూడా పరీక్షలు మంగళవారం నిర్వహించారు.
♦️ప్రశాంతంగా ఉన్న చిలకలూరిపేట చందవరం గ్రామానికి చెందిన కేసుతో కలకలం రేపింది. ఆ వృద్ధుడు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందటంతో ఆ సమయాల్లో వారితో పాటు ఉండి చికిత్స పొందిన వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వీరిలో ఎవరికైనా కేసు నమోదు అయినట్లయితే చిలకలూరిపేటలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు ఉండవచ్చని వైద్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
♦️ఏది ఏమైనప్పటికీ బుధవారం,గురువారం కోవిడ్ పరీక్షల రిజల్ట్ వస్తే గాని చిలకలూరిపేట్ పై కేసుల ప్రభావం.ఎలా వుండనుందో తెలుస్తుంది..