728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 31, 2020

చిలకలూరిపేటకు కరోనా వైరస్ చైన్ లింకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..?

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిడ్ వైరస్ పెరగడానికి కారణం విజయవాడ నుంచి ఈ లింక్ వచ్చిందే నని నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

♦️ఈ కోవిడ్ వైరస్ చందవరం గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు విజయవాడలో వాచ్మెన్ గా పని చేస్తూ అనారోగ్యం పాలయి వారి బంధువులకు తెలియజేయడంతో వారు అతనిని ఒక వాహనంలో తీసుకుని వచ్చి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సిఫార్సుతో అతని జాయిన్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

♦️అయితే 18 వ తేదీ నుండి 20వ తేదీ వరకు అతను తీవ్ర అస్వస్థత గా ఉన్నప్పటికీ చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వలనే ఈ విధంగా వైరస్ పెరిగుతుందని  నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో

♦️20 తేదీన అతనిని కొన్ని పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పంపగా వైద్యం పొందుతూ అక్కడ అతను 20 తేదీన మృతి చెందగా 21వ తేదీన అతనిని చందవరం గ్రామంలో ఖననం చేశారు.  వైద్యులు అనుమానంతో అతనిని నమునాలను కోవిద్ పరీక్షలకు పంపగా  23వ తేదీన ఆ వృద్ధునికి  కోవిడ్ వైరస్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది.

♦️ఈ పరీక్షల్లో కోవిద్ వైరస్ ఆ వృద్దునికి సోకిందని తెలియడంతో చిలకలూరిపేట  వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు.

♦️ప్రభుత్వాసుపత్రిలో పనిచేసిన పూర్తి స్థాయి సిబ్బంది, చందవరం గ్రామంలో మరియు అతని బంధువులు గ్రామాలలో పూర్తి స్థాయిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

చినపీరుసాహెబ్  వీధిలో

♦️ఆ వృద్ధుని ద్వారా చందవరం గ్రామం లోని ఆయన భార్య,కూతురు, తిమ్మాపురం లో వారి బంధువు అయిన ఒక మహిళ అలానే ప్రభుత్వ ఆసుపత్రిలో ధోభీ గా పనిచేస్తున్న పట్టణ  రజక వీధి లోని ఒక మహిళ ఇలా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ వైరస్ విజృంభించేలా ఉందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

♦️అయితే చినపీరుసాహెబ్ వీధిలోని మహిళకు ఏ విధంగా వైరస్ సోకిందనేదీ  ఇప్పటికీ అంతుబట్టని విధంగా మిస్టరీ గా ఉంది. ఆ మహిళ ఇంటికి గుంటూరు నుండి కొంతమంది బంధువులు వచ్చి కొన్ని రోజులు వున్నట్లు, వీరు ఆర్.ఎం.పి వైద్యం చేయించుకున్నట్లు, ఈమె ఒక ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించినట్లు, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నపుడు వైరస్ సోకినట్లు పుకార్లు వస్తున్నాయి.

♦️ఈ విషయంపై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  ఎవరి ద్వారా చిన్నపీరు సాహేబు వీధి మహిళకు ఈ వైరస్ సోకిన అనే విషయం తెలియనుంది.

కోవిద్ వైరస్ టెస్ట్ రిపోర్ట్లు రావాలి

♦️అయితే ఇప్పటికే చందవరం, గొరిజవోలు,ఎడ్లపాడు ప్రాంతాల్లో సుమారు 200 మందికి, చిలకలూరిపేట పట్టణ పరిధిలో సుమారు 217 మంది కి వెరసి సుమారు  417 మందికి ఈ వైరస్ పరీక్షలు గత రెండు రోజుల క్రితం చేశారు. పూర్తి ఫలితాలు ఇంకా అందలేదు.  ఈ పూర్తి ఫలితాలు నేడో రేపో వస్తే కానీ ఈ వైరస్ ఎక్కడ నుంచి ఎక్కడెక్కకడకు  విస్తరిస్తుందో తెలుస్తుంది.

♦️ఏది ఏమైనప్పటికీ విజయవాడ నుండి వచ్చిన చందవరం వృద్దుని ద్వారా వైరస్ లింక్ చైన్ లింకులా మారడంతో  కొద్దిరిజులుగా ప్రశాంతంగా ఉన్న చిలకలూరిపేట ప్రజల్లో ఆ కోవిద్ వైరస్ నేడు భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పవచ్చు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటకు కరోనా వైరస్ చైన్ లింకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? Rating: 5 Reviewed By: NEWS UPDATE