హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న నగర వాసులకు ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, కోఠి, బేగం బజార్, అబిడ్స్, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, అంబర్‌పేట, కాచీగూడ, నల్లకుంట, మోహదీపట్నం, లంగర్‌హౌస్, సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్, మలక్‌పేట్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.క్యూములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో అక్కడక్కడా వర్షం కురుస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.అధిక ఉష్ణోగ్రతలు ఎక్కడైతే నమోదవుతాయో అక్కడ ఈ మేఘాలు ఏర్పడతాయని తెలిపింది. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షం కురుస్తున్నట్లు పేర్కొంది.సాయంత్రానికి మరికొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణపై తుపాను ప్రభావం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

