గుంటూరు జిల్లా: ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని స్పష్టంచేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం మండల కేంద్రం యడ్లపాడులో గురువారం అనూహ్యంగా ఒకే ఇంటిలో భార్యాభర్త, కుమారుడు.. మూడు కరోనా కేసులు నమోదవడంతో స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని గురువారం హుటాహుటిన గ్రామానికి వెళ్లారు.
అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాలంటీర్లు, రెవెన్యూ, వైద్య, మండల, పోలీసు అధికారులందరిని అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎంతమంది అనుమానితులు ఉంటే వారందరినీ క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు ఇంటింటి సర్వేను కఠినంగా చేపట్టాలని సూచించారు.
ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరిని కళ్లారా చూసిగాని వారి ఆరోగ్య పరిస్థితిపై అంచనాకు రావద్దని స్పష్టంచేశారు. కంటైన్మెంట్ జోన్‌లో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో ఎక్కడా టిఫెన్, టీ కొట్లు ఉండటానికి వీల్లేదని చెప్పారు. అధికారులు చేపట్టిన జాగ్రత్త చర్యలు, బారికేడ్లు, పారిశుద్ధ్య పనులు తదితరాలను అమె ప్రత్యక్షంగా పరిశీలించారు. వైద్య శిబిరం కొనసాగించాలన్నారు. రెడ్ జోన్‌లో ఉన్నవారికి ఏ ఏ అవసరాలు కావాలో ముందు రోజే తెలుసుకుని వాలంటీర్లు వారందరికీ మరుసటి రోజు ఉదయానికి అందజేయాలని చెప్పారు. 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయాలని సూచించారు.
కంటైన్‌మెంట్ జోన్లలో పనిచేసే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఎవరి అజాగ్రత్త వల్లనైనా కేసులు నమోదయ్యే పరిస్థితి తలెత్తితే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వెంట రూరల్ సీఐ సుబ్బారావు , తహశీల్దార్ సుజాత , ఎంపీడీవో మాధురి , వైద్యాధికారి లక్ష్మారెడ్డి , ఎస్ఐ నాగేశ్వరరావు , ఆయా విభాగాల అధికారులు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు ఉన్నారు.