728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2020

చిలకలూరిపేట పట్టణంలోని రెండు ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు⁉️


చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణం లోని మరో రెండు ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

♦️పట్టణంలోని సుగాలి కాలనీకి చెందిన ఒక మహిళ గత నెల చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేరి వైద్యం పొందినట్లు  సమాచారం.  అదే వార్డులో  చందవరం గ్రామం చెందిన వృద్ధుడు మహిళ చికిత్స పొంది నట్లు వార్డులో ఉన్నట్లు తెలుస్తోంది.

♦️ఆ మహిళ కు కూడా వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా ఆ పరీక్షల్లో అనుమానాస్పదంగా ఉండటంతో నేడు మరలా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

♦️అయితే ఆ ప్రాంతం మొత్తం అధికారులు హైపో క్లోరైడ్  సోడియం ద్రావణాన్ని స్ప్రే చేసి ఆ వీధిలో జనం జరగకుండా పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.

♦️అలానే కొద్ది రోజుల క్రితం రజక వీధి లో కంటైన్మెంట్ జోన్ ను  ఏర్పాటు చేసిన అదే  ప్రాంతంలో ఒక వ్యక్తి ఇరవై రోజుల క్రితం చెన్నై నుండి వచ్చి ఉండటంతో ఆ వ్యక్తికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తికి సంబంధించి అనుమానంగా వుండతతో నేడు మరలా కోవిడ్ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉండటంతో పట్టణంలో ప్రధానంగా ఇరువురు  వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు మరో ఇరువురికి కోవిడ్ వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.

♦️వీరితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో మొత్తం మీద పట్టణంలో నలుగురు వ్యక్తులకు పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

♦️ఏదేమైనప్పటికీ ఈ రోజు వారి నలుగురికి   పరీక్షలు నిర్వహిస్తే గాని పూర్తి సమాచారం తెలియదు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలోని రెండు ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE