గుంటూరు జిల్లా: జిల్లాలో లాక్ డౌన్ ను ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం కంటైన్మేంట్ జోన్ల వరకు పరిమితం చేస్తున్నందున, ఇతర ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
🔹ఆదివారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావుతో కలసి వైద్య ఆరోగ్య శాఖ, రైల్వే, ఆర్ టి సి, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుండి ప్రత్యేక ప్యాసింజర్ రైళ్ళు పిడుగురాళ్ళ, గుంటూరు, పెదకాకాని, నంబూరు, మంగళగిరి స్టేషన్లలో ఆగనున్నాయన్నారు. రైళ్ళలో వచ్చిన వారిని రైల్వే స్టేషన్ లోనే ధర్మల్ స్క్రీనింగ్ చేసి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి, ప్రతి బోగీలో కనీసం ఐదుగురికి శాంపిల్స్ తీసి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు.
🔹పరీక్ష ఫలితాలు వచ్చే వరకు అనుమానిత లక్షణాలు ఉన్నవారిని మాత్రం క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలన్నారు. రైల్వే స్టేషన్లలో శాంపిల్స్ తీసేందుకు, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు వైద్య ఆరోగ్య బృందాలు, క్వారంటైన్ ఐసోలేషన్ అధికారులను నియమించాలని, అలాగే ప్రత్యేకంగా రెండు బస్సులను రైల్వే స్టేషన్ వద్ద సిద్దంగా వుంచాలన్నారు. శాంపిల్స్ సేకరణ కోసం రైల్వే స్టేషన్ లో బూత్ లను ఏర్పాటు చేయాలన్నారు.
🔹నూతన నిబంధనల ప్రకారం పది పాజిటివ్ కేసుల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కంటైన్మేంట్ క్లస్టరు, బఫర్ జోన్ కలిపి కంటైన్మేంట్ జోన్ 200 మీటర్ల పరిధి ఉంటుందన్నారు. పది పాజిటివ్ కేసుల కన్నా తక్కువగా వుంటే మాత్రం సంబంధిత వ్యక్తి నివసిస్తున్న రహదారి లేదా అపార్ట్మెంట్ మొత్తం కంటైన్మేంట్ జోన్ గా పరిగణిస్తామన్నారు. గుంటూరు నగరంతో పాటు, నరసరావుపేట, జిల్లాలోని ఇతర ప్రాంతాలలోను నూతన నిబంధనల ప్రకారం కంటైన్మేంట్ జోన్ల పరిధిని గుర్తించి పూర్తిగా బారీకేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కంటైన్మేంట్ జోన్ల పరిధిలో మినహా ఇతర ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటు దుకాణాలు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
🔹గుంటూరు బస్స్టాండ్ నుండి బస్సులు విజయవాడ, నరసరావుపేట మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించవచ్చన్నారు. ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ కు తరలిస్తున్నందున వారు ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా ప్రతి రోజు ఎ ఎన్ ఎం, ఆశా వర్కరు, వాలంటీరు పర్యవేక్షించాలన్నారు. హోమ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించని వారి సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేస్తే వారు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు.
🔹ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ( రెవిన్యూ, వ్యవసాయం) ఎ ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( అభివృద్ధి, సచివాలయాలు) పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) శ్రీధర్ రెడ్డి, గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ మోహన్ రాజా, రెవిన్యూ డివిజనల్ అధికారి సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.జే.యాస్మిన్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా అనురాధ, డి ఆర్ డి ఎ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు యుగంధర్ కుమార్, శ్రీనివాస రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బాల కృష్ణ మూర్తి, ఆర్ టి సి ఆర్ ఎం రాఘవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.