చిలకలూరిపేట:
🔸చిలకలూరిపేట పట్టణంలోని చినపీరుసాహెబ్ వీధిలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటి నుండి వరుసగా అదే వీధిలో కేసులు నమోదవుతున్నాయి.
🔸ఆ ప్రాంతంలో అధికారులు 200 మీటర్ల మేర కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా కళామందిర్ సెంటర్ నుండి శారదా హైస్కూల్ రోడ్డుకు వెళ్లే రెండు దారుల్లో వ్యాపార సముదాయాలు వున్నాయి.
🔸మార్చి నెల 23వ తేదీ నుండి తమ షాపులు మూసి వేసుకోవాల్సి వచ్చిందని, తీరా షాపులు తెలుసుకోవడానికి వెసులుబాటు వచ్చే సమయానికి ఆ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు కారణంగా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.
🔸షాపులు మూసివేత కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని కంటైన్మెంట్ జోన్ను కుదించాలని వ్యాపారస్తులు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, డాక్టర్ గోపీనాయక్, అర్బన్ ఇన్చార్జి సిఐను కలిసి విన్నవించారు.
🔸ఇదిలా ఉంటే రజక వీధిలోని ఒక మహిళకు గత నెల 27వ తేదీన కరోనా రావడంతో ఆ మహిళ చికిత్స పొంది ఈనెల 8వ తేదీన కోలుకుని ఇంటికి చేరుకుంది. ఆ వీధిలో కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల సెంటర్లోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూత బడ్డాయి. రెండు రోజుల క్రితం ఆ ప్రాంత వ్యాపారస్తులు అధికారులను కలిసి కంటైన్మెంట్ జోన్ను ఎత్తివేయాలని కోరారు.
🔸అయితే పాజిటివ్ కేసు నమోదైన 28 రోజుల తర్వాత కంటైన్మెంట్ జోన్ను ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు తెలియజేసినట్లు తెలిసింది.
🔸ఆ విధంగా చూస్తే పాజిటివ్ కేసు నమోదు అయిన 28 రోజులు లెక్క ప్రకారం బుధవారం 24వ తేదీన కంటైన్మెంట్ జోన్ను ఎత్తివేసే అవకాశాలు అధికారులు పరిశీలిస్తున్నారు. అలానే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చినపీరుసాహెబ్ వీధిలో కంటైన్మెంట్ జోన్ను కుదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.