♦️మాస్కులు లేకుండా తిరిగితే 500 నుండి 1000 రూపాయల వరకు అపరాధ రుసుము తప్పదని చిలకలూరిపేట అర్బన్ సి.ఐ సూర్యనారాయణ తెలియజేశారు.
♦️భాస్కర్ సెంటర్లో పలువురు మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి సూర్యనారాయణ అపరాధ రుసుం విధించారు.
♦️ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని వీరు కోరారు.
♦️కంటైన్మెంట్ జోన్ల విషయంలో ఆయన మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లో కరోనా పాజిటివ్ కేసు నమోదైన 28 రోజుల తర్వాత కంటెంట్మెంట్ జోన్ను జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఎత్తివేస్తామని, అలానే ఏదైనా కేసు నమోదైతే నమోదైన రోజు నుండి 28 రోజుల వరకు కంటెంట్మెంట్ జోన్ ఉంటుందని తెలిపారు.
♦️ఈ విధంగా చినపీరుసాహెబ్ వీధిలోని కంటైన్మెంట్ జోన్ ఇంకా కొద్దిరోజుల వరకు ఎత్తివేసే అవకాశం లేదని తెలుస్తోంది.
♦️అయితే రజక వీధిలోని కంటైన్మెంట్ జోన్ లెక్కల ప్రకారం ఏ పాజిటివ్ కేసు నమోదు కాకపోతే ఈ నెల 22వ తేదీన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కుదింపు చేయవచ్చు.
