అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం దిల్లీ చేరుకుని 3గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో, సాయంత్రం 4.45కి గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో, రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించాల్సి ఉంది. అయితే, కరోనా లాక్‌డౌన్ సడలింపుల పరిణామాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉండటంతో సీఎం పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం. జగన్ దిల్లీ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
June 2, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జగన్ దిల్లీ పర్యటన వాయిదా
Rating: 5
Reviewed By: NEWS UPDATE

