728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 23, 2020

పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు కరోనా.. నవదంపతుల సహా మొత్తం క్వారంటైన్‌లోకి!

కర్ణాటక: పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు వైరస్ సోకడంతో కొత్త జంట సహా వారి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైనవారు అందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జరిగిందీ ఘటన.

అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు కరోనా.. నవదంపతుల సహా మొత్తం క్వారంటైన్‌లోకి! Rating: 5 Reviewed By: NEWS UPDATE