728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

తల్లిగా బాధగా ఉంది.. గర్విస్తున్నా: సంతోష్ బాబు తల్లి

సూర్యాపేట:
★ భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఆర్మీ అధికారితో సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.

★ ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

★ కాగా తాజా ఘటనతో... సరిహద్దుల్లో ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది.

★ నిజానికి గత కొన్ని వారాలుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. దీనిపై ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినప్పటికీ... ఉద్రిక్తత తగ్గలేదు.

★ పైగా, సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు.

★ ఈ దాడి ఘటనతో సరిహద్దు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

★ కాగా... గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత సైన్యం స్పందించింది. గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని తెలిపింది.

★ ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు ముగ్గురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. భారత్ సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది.

సంతోష్ బాబు తల్లి మాట్లాడుతూ:
నా కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది అని భారత ఆర్మీ కల్నల్, సంతోష్ బాబు తల్లి తెలిపారు.

★ తల్లిగా బాధగా ఉంది..

★ ఉబికివచ్చే కన్నీళ్లతో ఆ మాతృమూర్తి.

★ దేశం కోసం నా కుమారుడి ప్రాణాలు పోయాయి.. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం బాధిస్తుంది..

★ దేశం కోసం కుమారుడు చనిపోయినందుకు మరోవైపు  ఆనందంగా ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తల్లిగా బాధగా ఉంది.. గర్విస్తున్నా: సంతోష్ బాబు తల్లి Rating: 5 Reviewed By: NEWS UPDATE