♦️చిలకలూరిపేట పట్టణంలోని పాటిమీద గ్యాస్ అనిల్ అనే వ్యక్తి వద్ద నుండి చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడి చేసి తెలంగాణ నుంచి తెచ్చి విక్రయిస్తున్న 96 మద్యం సీసాలు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 31,680 రూపాయలు ఉంటుందని అంచనా.
♦️పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని సిఐ నయనతార మీడియాకు తెలియజేశారు.
♦️ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఈరోజు ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించి గ్రామంలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల తో గ్రామ పెద్దలు తో మాట్లాడి కొండవీడు గ్రామంలో నాటు సారా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ నాటుసారా గ్రామంలో కాకుండా చూడాలని వారు సూచించారు.
