728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారు: తెదేపా మహిళలు

చిలకలూరిపేట: పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెంచిన రేషన్ సరుకులు ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించే కందిపప్పు, పంచదార ధరలను పెంచడం జరిగింది. ఇప్పటి వరకూ కేజీ కందిపప్పు ధర 40 రూపాయలు ఉన్న రేటును 67 రూపాయలకు, కేజీ పంచదార ధర 20 రూపాయల ఉన్న రేటును 34 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం పెoచడం జరిగింది. ఎవరైనా కేజీ కందిపప్పు, కేజీ పంచదార కావాలి అనుకుంటే, వారికి అదనంగా గతంలో కంటే అయ్యే ఖర్చు 41 రూపాయలు. ఇది పేదలకు ఎంతో ఇబ్బంది కరమని, ఈ విధంగా రేషన్ ధరలు పెంచుకుంటూ పోతే మార్కెట్లో ఉన్న సరుకుల ధరకి, రేషన్ డిపోలలో ఇస్తున్న సరుకుల ధరకి తేడా ఏముంటుందని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం, అమ్మ ఒడి పేరుతో మహిళలకు ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మద్యం ధరలు 100 శాతం  పెంచి మరో చేత్తో లాక్కుంటున్నారని, రైతు భరోసా పేరుతో ఒక చేత్తో డబ్బులిస్తూ, ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి మరో చేత్తో లాక్కుంటున్నారని, వాహన మిత్ర పథకం పేరుతో ఆటో యజమానులకు డబ్బులిచ్చి, మరో చేత్తో పెట్రోలు, డీజిల్ పై  టాక్స్ లు విపరీతంగా పెంచారు. జగనన్న చేయూత అమలు చేసి ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి ఆ డబ్బును వెనక్కు లాక్కున్నారని, ఇప్పుడు కాపు నేస్తం అమలు  పేరుతో రేషన్ సరుకుల ధరలు పెంచారని, జగన్ అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం వెనుక సామాన్య ప్రజలను దోచుకునే మరో ధరల పెంపు పథకం ఉంటుందని, రాష్ట్రంలో ఈ విషయం ప్రతి మహిళా గుర్తించారని, అకౌంట్ లో డబ్బులు వేస్తే అన్ని మర్చిపోతారు అనుకుంటే అది మీ భ్రమేనని తెలిపారు. మొత్తంగా ధరలు పెంచడం అనేది పేదలకు ఆర్థిక భారమే. అసలే కరోనా కాలం నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా అనేక మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు సైతం తమ ఉపాధిని కోల్పోయారు. దీంతో అధిక ధరలు చెల్లించి ఇంటికి కావలసిన నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. ప్రజల దగ్గర కూడా అంత డబ్బు లేదు. దీంతో ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇబ్బందికరమే అని అన్నారు. గతంలో ఉన్న రేటు ప్రకారమే రేషన్ ఇవ్వాలని తక్షణమే పెంచిన రేషన్ సరుకులు ధరలు వెంటనే తగ్గించాలని లేకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మహిళలు పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఈ సమావేశంలో అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి, మిరియాల రత్నకుమారి, పావులూరి అరుణ కుమారి, బిట్రా శ్రీదేవి, వనిత భాయి, షేక్ గౌసా, ఎస్తరు రాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారు: తెదేపా మహిళలు Rating: 5 Reviewed By: NEWS UPDATE