728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

కరోనా కొత్త లక్షణాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతోంది. మన దేశంలోనూ రోజుకు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 500 మంది కరోనా బారిన పడి మరణిస్తున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇది వరకు నిర్ధారించారు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా లక్షణాల్లో మరికొన్ని చేరినట్లు ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది. ఈ మేరకు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అనే సంస్థ కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటనను జారీ చేసినట్లు తెలిపింది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.

కరోనా లక్షణాలు..
🔷జ్వరం

🔷వణుకు

🔷దగ్గు

🔷శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

🔷అలసట

🔷ఒళ్లు నొప్పులు

🔷తలనొప్పి

🔷రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం

🔷గొంతునొప్పి

🔷ముక్కు కారడం

🔷వికారం లేదా వాంతులు

🔷డయేరియా

ఎలాంటి సమయంలో వైద్య సాయం కోరాలి?
పైన కనబరిచిన లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని... ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని ఏపీ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19 డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. అదే సమయంలో  శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నప్పుడు, ఛాతిలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తున్నపుడు, ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలున్నప్పుడు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలని....లేదా 104 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా కొత్త లక్షణాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం Rating: 5 Reviewed By: NEWS UPDATE