728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని: జనక్రాంతి పార్టీ

చిలకలూరిపేట: కంటైన్మెంట్ జోన్ లేని ప్రదేశంలో కార్మికులు ఏదో ఒక పని చేసుకొని తమ జీవనాన్ని ముందుకు కొనసాగిస్తున్నారని అలాంటి అవకాశం ప్రైవేటు ఉపాధ్యాయులకు మరియు అధ్యాపకులకు  లేదని రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్ తెలిపారు.

సోమవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కొన్ని పాఠశాలలు మరియు కళాశాలలు ఉపాధ్యాయులకు మరియు అధ్యాపకుల జీతాలు ఇవ్వలేక పోతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని అన్నారు.  కరోనా సంక్షోభంలో మానవత్వంతో ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వృత్తుల వారికి వర్గాల వారికి ఏ విధముగా అయితే ఆర్థిక సహాయం చేస్తుందో ఆదే సహాయాన్ని ప్రైవేటు ఉపాధ్యాయులకు మరియు అధ్యాపకులకు చేయాలని అన్నారు.

ఈ విధముగా రాష్ట్రం మొత్తం మీద లక్షా పాతిక వేల మంది ప్రైవేటు ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని: జనక్రాంతి పార్టీ Rating: 5 Reviewed By: NEWS UPDATE