🔹ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం లోని స్మశాన భూమి వివాదం గురించి సోమవారం టిడిపి మండల అధ్యక్షుడు ముద్దన నాగేశ్వరావు చేసిన ప్రకటనను వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా విగ్నేశ్వర రెడ్డి మీడియా సమావేశంలో ఖండించారు.
🔹గత ప్రభుత్వ హయాంలో స్మశానాలు ఆక్రమించుకొని, కొండవీడు చుట్టూ ఉన్న భూములు ఆక్రమించుకొని, మట్టిని తీసుకుని పేద ప్రజలను ఇబ్బంది పెట్టింది మీరు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
🔹వైసీపీ ప్రభుత్వం లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతాయని తమకు ఏ పార్టీ అయినా ఒకటే నని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
