చిలకలూరిపేట:
♦️ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో కొండవీడు కొండపై ఏం జరుగుతుంది..? లాక్ డౌన్ వల్ల గత మూడు నెలల నుండి మద్యం షాపులు తెరవకపోవడంతో దానిని క్యాష్ చేసుకొని కొంతమంది సారా తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతున్నారు.
♦️కొండవీడు గ్రామంలో కొండ కింద నుండి కొండపైకి నీరు, రమ్ములను చేర్చి పైకి తీసుకు వెళ్లి నాటుసారా కాస్తున్న పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు.
♦️ఈ విషయంపై చిలకలూరిపేట నియోజకవర్గ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు దృష్టి కేంద్రీకరించి ఇప్పటికీ కొండవీడు గ్రామంలో, కొండవీడు కొండపై అనేకసార్లు దాడులు చేసి వేల లీటర్లు బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
♦️చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు గురువారం సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు కొండ మొత్తం గాలింపు చర్యలు చేపట్టి, 1200 లీటర్ల బెల్లం ఊటను పట్టుకొని బట్టి ఒక దాన్ని ధ్వంసం చేశారు.
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో కొండవీడు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో... రాత్రుళ్ళు సారా కాసే అక్రమ వ్యాపారులకు కూడా కొండవీడు కోట అడ్డాగా మారింది.రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతి గాంచిన కొండవీడు గ్రామంలో జరిగే అక్రమ సారా కాసే వారిని అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
♦️ఇప్పటికైనా ఈ విధమైన పర్యాటక ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ నాటు సారా కాయకుండా చూడాలని కొంతమంది పర్యాటకులు కోరుతున్నారు.