♦️ఒకే కుటుంబంలో ఇరువురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ కుటుంబం ఛిద్రమయ్యింది. ముగ్గురు ఉన్న ఆ కుటుంబంలో ముగ్గురు మూడు చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో వున్నారు.
♦️చిలకలూరిపేట పట్టణ చిన్నపీరు సాహెబ్ వీధికి చెందిన ఒక మహిళకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా వైరస్ సోకగా ఆ మహిళకు 25వ తేదీన విజయవాడ లోని ఆస్పత్రి ఐసోలేషన్ కు తరలించారు.
♦️ఆమె కుమారుడు, భర్తకు 27 వ తేదీ నుంచి కె.ఎం.సి క్వారంటైన్ లో ఉంచారు. గత నాలుగు రోజుల క్రితం అతని కుమారుని కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అతనిని గుంటూరులోని గోరంట్ల క్వారంటైన్ సెంటర్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
♦️ఆమె భర్త ప్రస్తుతం కె.ఎం.సి క్వరెంటైన్ లో ఉన్నారు. కలసిమెలసి చిన్నపాటి పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆ కుటుంబంలోని ముగ్గురు నేడు చెట్టుకొకరు పుట్టకొకరు ల కరోనా విడదీసి వారి తలరాతల్ని మార్చి, వేరు వేరు చోట్ల ఉండేలా చేసింది.
♦️ఆ మహిళ వైద్యశాలలో కోలుకుంటూ ఉండగా, ఆమె కుమారుడు గుంటూరు గోరంట్లలోని క్వరెంటైన్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు.
♦️ఆమె భర్త కె.ఎం.సి క్వరెంటైన్ సెంటర్ లో ఉన్నాడు. అయితే గోరంట్ల లో ఉంటున్న ఆ యువకునికి సరైన ఆహార సదుపాయాలు, ఆదరణ కరువైందని ఆ యువకుడు బుధవారం నాడు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం, ఆ వీడియో చిలకలూరిపేటలో చక్కర్లు కొడుతుంది.
♦️తమకు ఈ దుస్థితి రావడం బాధాకరమని తనను జాగ్రత్తగా చూసుకోవాలని ఆ యువకుడు ఆ వీడియోలో చెప్పటం తో ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందో చెప్పటంతో కరోనా.. ఆ కుటుంబాల్ని ఎలా విడదీసిందో అందనిరిని ఆలోచింపజేస్తుంది.
ఆ యువకునికి మంచి ఆహారం ఇవ్వండి: ఎమ్మెల్యే రజని
♦️ఆ యువకుడికి గోరంట్ల ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించడం లేదని సోషల్ మీడియాలో వీడియో రావటంతో చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గోరంట్ల ఆసుపత్రి వైద్యుల తో మాట్లాడి ఆ యువకునికి మంచి ఆహారం, వైద్యం అందించి ఇబ్బంది లేకుండా చేయాలని తెలిపారు.

