అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,584 సాంపిల్స్ ని పరీక్షించగా 10,093 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. 2,784 మంది కోవిడ్ నుండి కోలుకొని నేడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల నేడు తూర్పు గోదావరిలో పద్నాలుగు మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూర్ లో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు మరియు పశ్చిమ గోదావరిలో ఇద్దరు మరణించారు. నేటి వరకు రాష్ట్రంలో 18,20,009 సాంపిల్స్ ని పరీక్షించారు. నేడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటవరకు మొత్తం 1,20,390 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 63,771 యాక్టివ్ కేసులు ఉండగా.. 55,406 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 1,213 మంది చనిపోయారు.
July 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా 10,093 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

