728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 29, 2020

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల... జిమ్‌లకు ఓకే.. హాళ్లకు నో!

న్యూఢిల్లీ:
★ అన్‌లాక్-3కి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.

★ దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

★ అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్-3 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొంత ఊరట లభించే విధంగా సడలింపులను ప్రకటించింది.

★ రాత్రి వేళ్లలో ఇప్పటివరకూ విధిస్తున్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

★ ఆగస్ట్ 5 నుంచి యోగా ఇన్‌స్టిట్యూట్స్‌, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది.

★ అయితే.. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

★ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా అనుమతినిచ్చిన కేంద్రం భౌతిక దూరంతో పాటు ఇతర హెల్త్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని స్పష్టం చేసింది.

★ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్ట్ 31 వరకూ మూసే ఉంటాయని తెలిపింది.

★ వందే భారత్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు పరిమిత సంఖ్యలో అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది.

★ అయితే.. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నడిపేందుకు, సినిమా హాల్స్‌ తెరిచేందుకు అనుమతి లేదని తెలిపింది.

★ అంతేకాదు, స్విమ్మింగ్ పూల్స్‌కు, పార్కులకు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

★ ఈ పైన పేర్కొన్న వాటిలో పరిస్థితిని అంచనా వేసి దశల వారీగా అనుమతినివ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల... జిమ్‌లకు ఓకే.. హాళ్లకు నో! Rating: 5 Reviewed By: NEWS UPDATE