728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 19, 2020

చిలకలూరిపేట: నేడు మరో 7 కరోనా కేసులు నమోదు... 15కు చేరిన నేటి కేసుల సంఖ్య

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు ఉదయం 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే. అలానే పట్టణంలోని కృష్ణానగర్ 4వ వీధిలో నివసిస్తున్న ఒక యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతను గత కొద్ది రోజుల క్రితం నెల్లూరు నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అలానే తూర్పుమాలపల్లికి చెందిన ఫ్రూట్ మార్కెట్ లో పనిచేసే వ్యక్తికి భావనారుషి నగర్ వ్యక్తి ద్వారా కరోనా సోకిందన్న అనుమానంతో  తేస్ చేయించగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ఈ రెండు కేసులతో నేడు నమోదైన కేసుల సంఖ్య పదికి చేరింది.

నాదెండ్ల మండలం:
సాతులూరు బొమ్మలాట కాలనీలోని ఒక వ్యక్తికి (45) కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.

ఎడ్లపాడు మండలం:
నాయుళ్ల బజార్లో ఒక వ్యక్తికి (44), తొమ్మిది సంవత్సరాల బాలికకు, అలానే ఎడ్లపాడులో ఇంకో వ్యక్తికి, మరో మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎడ్లపాడు అధికారులు తెలిపారు. మొత్తం మీద ఈ రోజు ఎడ్లపాడులో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద చూస్తే ఈరోజు పట్టణంలో 10, నాదెండ్ల మండలంలో 1, ఎడ్లపాడు మండలంలో 4 మొత్తంమీద నియోజకవర్గంలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నేడు మరో 7 కరోనా కేసులు నమోదు... 15కు చేరిన నేటి కేసుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE