చిలకలూరిపేట: పట్టణంలోని సుబ్బయ్య తోటలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో ఉంటున్న తండ్రి, కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు నిర్ధారించారు.
పట్టణంలో గత వారం రోజుల నుండి వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల యొక్క ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల యొక్క పరీక్షలు నేటికీ నిర్వహించకపోవడంతో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల యొక్క ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదియును గాక గుంటూరు జిల్లా మొత్తం మీద కేవలం 6 నుండి 8 మాత్రమే 108 సర్వీసులు మాత్రమే ఉండటంతో చిలకలూరిపేటలో కరోనా వచ్చిన వారు స్వయంగా కోవిడ్ కేర్ సెంటర్కు వెళ్లాల్సి వస్తుంది.
కావున వెంటనే చిలకలూరిపేటలో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారు 108 రాక పోవటంతో వారు స్వయంగా కోవిడ్ కేర్ సెంటర్ కు వెళుతున్నారు. వీరు వెళ్లే మార్గమధ్యంలో కరోనా వైరస్ ఇంకెవరికైనా సోకే అవకాశాలు ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావున కరోనా వైరస్ వచ్చిన వ్యక్తులను 108 అంబులెన్స్లో తరలించాలని అని పలువురు కోరుతున్నారు.